ఆకులే మాస్క్‌లు.. ఆదర్శంగా నిలుస్తున్న అడవి బిడ్డలు

శ్రీకాకుళం, విజయనగం.. ఈ రెండు జిల్లాలూ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కడో విసిరేసినట్లు ఉండే ఏజెన్సీ గ్రామాల్లో వేల సంఖ్యలో అడవి బిడ్డలు జీవిస్తున్నారు. అక్షరాస్యతా శాతం కూడా ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తక్కువ. అయితేనేం కరోనాపై అక్కడి ప్రజల్లోని చైత్యన్యానికి అందరూ సలాం చేయాల్సిందే.

కారోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలంతా బయలకు వచ్చే ముందు మాస్కులు ధరించాలని అధికారులు వేడుకుంటున్నారు. ప్రజలు మాట వినకపోతుండటంతో ఫైన్‌లు సైతం వేస్తున్నారు. అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు మాత్రం లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. మాస్కులు అందుబాటులో లేకపోవడంతో ఆకులనే మాస్కులుగా ధరిస్తున్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురంలోని గిరి శిఖరాన గల మాలమామిడి గ్రామంలో నివశిస్తున్న గిరిజనులు ఇలా మీడియా కంటపడ్డారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో.. ఒడిశా రాష్ట్రానికి సమీపంలో ఉండే ఈ అడవి బిడ్డలు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి అడవిలో లభించే చెట్ల ఆకులనే మాస్కులుగా ధరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *