విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం: మృతుల వివరాలివే..

విజయవాడలోని రమేష్ ఆస్పత్రి కోవిడ్‌ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ మృతదేహాలను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణించిన పది మంది వివరాలను బంధువులు, అధికారులు గుర్తించారు. విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్ ఆస్పత్రి, హోటల్‌ యాజమాన్యాలపై విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుల వివరాలు..
1. కొసరాజు సువర్ణలత (42), గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడబ్రోలు
2. డొక్కు శివబ్రహ్మయ్య (59) బెల్‌ కంపెనీ మేనేజర్, మ‌చిలీప‌ట్నం (మూడ్రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చేరారు)
3. పొట్లూరి పూర్ణచంద్రరరావు (80).. కొడాలి, ఘంటశాల కృష్ణా జిల్లా. గతంలో గుంటూరు సీపీఓగా పని చేశారు. రిటైర్‌ అయిన తర్వాత పీఏసీఎస్ అధ్యక్షుడిగా చేశారు. లంగ్‌ ఇన్ఫెక్షన్‌తో కోవిడ్‌ సెంటర్‌లో చేరారు
4. సుంకర బాబూరావు (80) రిటైర్డ్‌ ఎస్సై. ఇందిరానగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌
5. మజ్జి గోపి (54) మచిలీపట్నం
6. జి.వెంకట జయలక్ష్మి (52) కందుకూరు, ప్రకాశం జిల్లా
7. వెంకట నర్సింహ పవన్‌ కుమార్‌, కందుకూరు, ప్రకాశం జిల్లా
8.9. స‌బ్బిలి ర‌త్న అబ్రహం (48), రాజ‌కుమారి (భార్యభర్తలు), జగ్గయ్యపేట
10. మ‌ద్దాలి ర‌ఘు, మొగ‌ల్రాజ‌పురం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *