పూరీ బీచ్‌లో అయోధ్య సైకత రామాలయం

ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ సందర్భంగా రామనగరం అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. దీపాల వెలుగులతో ఆ నగరం దేదీప్యమానంగా వెలుగుతోంది. భూమి పూజ కోసం అయోధ్య నగరం అంతా సర్వాంగా సుందరంగా సిద్ధమైంది. ఇదే సమయంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైతం రాముడిపై అతనికున్న అభిమానాన్ని చాటుకున్నారు. పూరీ బీచ్‌లో పట్నాయక్ కూడా తన కళాత్మక ప్రదర్శించారు. అయోధ్యలో నిర్మించనున్న రామాలయానికి చెందిన డిజైన్‌ను పూరీ బీచ్‌లో సైకత శిల్పం రూపంలో వేశారు. జైశ్రీరామ్ అన్న నినాదాంతో అద్భుతమైన రంగుల్లో ఆలయ డిజైన్ చేశారు. అంతేకాదు రాముడ్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *