మూడు రాజధానుల్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్

ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును ఆశ్రయించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేశారు.. జీఎన్‌రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ కోరారు. రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *