కడప జిల్లాలో ప్రాణం తీసిన శానిటైజర్.. ముగ్గురు మృతి

ఏపీ మద్యం దొరక్కపోవడంతో కొంతమంది శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుటున్నారు. ప్రకాశం జిల్లా ఘటన మర్చిపోకముందే కడప జిల్లాలో మరో ఘటన జరిగింది. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు చనిపోయిన ఘటన కలకలంరేపింది. శానిటైజర్‌ తాగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తన ఇంటి దగ్గర చనిపోయారు. మృతులను చెన్నకేశవులు, భీమయ్య, ఓబులేష్‌లుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఖననం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *