రాష్ట్ర రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

రాష్ట్ర రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.
ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు అయ్యే విధంగా దస్త్రంపై తొలి సంతకం చేశారు.
బియ్యం కార్డు ఉన్నవారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదంటూ ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి.
అర్హులైన వారికి ఆగస్టు 15వ తేదీన 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
భూ సమస్యలు, తగాదాల సత్వర పరిష్కారానికి, ఫ్రెండ్లీ రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం.
రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఉద్యోగుల శాఖ అయిన రెవెన్యూలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేందుకు కృషి చేస్తామన్నారు.
బీసీలకు అగ్రతాంబూలం వేసిన దార్శనికుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ఉత్తరాంధ్ర బీసీలకు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా..
రెవెన్యూ కార్యాలయాల ద్వారా అందే సేవలు గ్రామ, వార్డు సచివాలయల ద్వారా ప్రజలకు సత్వరమే అందేలా చర్యలు ఇకపై తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రం మొత్తం భూమిని రీ సర్వే నిర్వహించి.. రికార్డులను నవీకరించనున్నామని వెల్లడించారు.