KTR Birth Day: డియ‌ర్ తార‌క్ అంటూ చిరంజీవి సందేశం.. వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్

నేడు (జులై 24) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. నేటితో ఆయన 44 ఏళ్ళు పూర్తి చేసుకొని 45వ యేట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. కేటీఆర్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

”డియ‌ర్ తార‌క్ హ్యాపీ బ‌ర్త్ డే” అని పేర్కొన్న చిరంజీవి కేటీఆర్ సేవలను ప్రశంసించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యే తీరు ఆనందం కలిగిస్తుందని, అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ప్ర‌తీ విష‌యాన్ని వ్య‌క్తిగ‌తంగా స్వీక‌రించి, క్షుణ్ణంగా పరిశీలించే మీరు ఇలాగే భవిష్యత్తులో కూడా ప్రజలకు కొండంత బలంగా ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపారు చిరంజీవి. మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ చూసి మెగా వర్గాలు వెల్లువలా కేటీఆర్‌కి బర్త్ డే విషెస్ చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *