దళితుల ఆత్మాభిమానం కాపాడేది కాంగ్రెస్ మాత్రమే ____సంకు వెంకటేశ్వరరావు

 

విశాఖపట్టణం కాంగ్రెస్ సాక్షాత్తు దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న మనరాష్ట్రంలో పోలీసులు దళితులపై దాడి చేయటం దేనికి సంకేతమో అర్ధంకావటం లేదని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సంకువెంకటేశ్వర రావు అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆదేశాలమేరకు మూడురోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంకు వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలియచేసారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి, సామజిక దూరం పాటిస్తూ నిరసన చేస్తామని సంకు తెలిపారు. రాష్ట్రంలో అధికారపార్టీ నాయకులు , పోలీసులు దళితులమీద కక్షకట్టినట్లు దాడులు చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు, చీరాల, సీతానగరం, రాజమండ్రి ఇలా రాష్ట్రంలో అన్నిచోట్లా వరుస దాడులు చేస్తూ గూండాల్లా చెలరేగిపోతున్నారని సంకు విమర్శించారు.సోషల్ మీడియాలో పోస్ట్ నెపంతో మహేష్ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసారని, మాస్కు లేదనే నెపంతో కిరణ్ కుమార్ ను గొడ్డును బాదినట్లు బాది చంపేసారని, ఇసుక అక్రమ రవాణా పై ప్రశ్నించిన వరప్రసాద్ ను పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసి అవమానించారని సంకు ఆవేదన వ్యక్తం చేసారు.దళిత యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగితే ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని, దళితుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో చెలగాటమాడుతున్నారని సంకు ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాంగం ద్వారా దళితులకు సంక్రమించిన హక్కులకు ఏమాత్రం గౌరవం ఇవ్వడంలేదని, మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారని సంకు ఆరోపించారు. దాడిచేసిన పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా, తక్షణం ఉద్యోగాలనుంచి తొలగించాలని సంకు వెంకటేశ్వరరావు డిమాండ్ చేసారు. ఈ సంఘటనలపై దళిత శాసనసభ్యులు, మంత్రులు వెంటనే స్పందించి బాధితులకు తగిన న్యాయంచేసేవిధంగా కృషిచెయ్యాలని సంకు కోరారు.ముఖ్యమంత్రి చైర్మన్ గా రాష్ట్రస్థాయి విజిలెన్సు & మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఎస్టీ,ఎస్సీ ల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కాపాడడం కోసం అట్రాసిటీ యాక్ట్ తెచ్చి, సవరించి, బలంగా తయారుచేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్నీ సంకు గుర్తుచేశారు, ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం దళితులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సంకు ధ్వజమెత్తారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ రాజ్యాంగ స్పూర్తితో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిజాయతీగా బాధితుల కోసం పోరాడుతుందని సంకు వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *