విశాఖ ఉత్తరనియోజకవర్గంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కె.కె రాజు గారు

71 వనమహోత్సవంను పురస్కరించుకుని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జగనన్న పచ్చతోరణంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజికవర్గంలో GVMC సమక్షంలో 55 వార్డు ధర్మానగర్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు* పాల్గొని మొక్కలను నాటారు.
👉ఈ సందర్భంగా శ్రీ కె.కె రాజు మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షిత ప్రతిఒక్కరు మొక్కలను నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అని మొక్కలను నాటడం వల్ల భవిష్యత్తులో ఆక్సిజన్ కి ఇబ్బంది పడవలసి అవసరం వుండదని చెప్పారు
👉వాతావరణం సమతుల్యత,పర్యావరణ పరిరక్షణ ద్యేయంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు *గౌ! శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు* *జగనన్న పచ్చతోరణం* పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటే బహుత్తరమైన కార్యక్రమంను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో GVMC జోన్-4 కమిషనర్ సింహాచలం గారు,55వార్డు నాయకురాలు కె.వి.ఎన్ శశికళ,సేనపతి అప్పారావు,కటుమూరి సతీష్,యస్.ఎ.స్వామి,జె.గోవింద్,వై.శ్రీనివాస్,టి.వెంకటరావు,బద్రి, GVMC సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *