వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కుల వల్ల ఉపయోగం లేదు.. సాధారణ మాస్కులే బెటర్: కేంద్రం

 

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్రం
కోవిడ్ రాకుండా ఇవి అడ్డుకోలేవని స్పష్టీకరణ
వాటికంటే ఇంట్లో తయారుచేసిన సాధారణ క్లాత్ మాస్కులే నయమన్న కేంద్రం
మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఆరోగ్య కార్యకర్తలు కాకుండా ఇతరులు కవాటాలతో ఉన్న ఈ ఎన్-95 మాస్కులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడాన్ని తాము గమనించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *