మున్సిపల్‌ శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పాయింట్స్..

– వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించొద్దంటూ

మున్సిపల్‌ శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పాయింట్స్..

– వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించొద్దంటూ గవర్నర్ కు చంద్రబాబు లేఖ రాయడం సిగ్గుచేటు
– అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ను కప్పిపుచ్చేందుకే గవర్నర్ కు చంద్రబాబు లేఖ
– వికేంద్రీకరణకే శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేస్తే.. బాబు వక్రీకరిస్తున్నాడు
– ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి టీడీపీకి ఏనాడూ లేదు
– గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని వస్తే.. మిగతా ప్రాంతాలకు అన్యాయం చేసినట్లేనని కమిటీ చెప్పింది
– నాడు రాజధాని నిర్ణయంలో ప్రజల మనోభావాలను పట్టించుకోని చంద్రబాబు
– పుట్టిన రాయలసీమ మీద ఎందుకింత కోపం?.. ఉత్తరాంధ్ర మీద ఎందుకంత కక్ష బాబూ..?
– అన్ని ప్రాంతాల అభివృద్ధి… అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– అందుకే పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది
– శాసనసభ, మండలిలో నిబంధనలకు అనుగుణంగానే బిల్లులు
– ఆ తర్వాత రాజ్యాంగబద్ధంగానే బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపాం
– బిల్లులు ఆమోదించవద్దని చంద్రబాబు కోరడం అసమంజసం
-గవర్నర్ కు రాసిన లేఖలో చంద్రబాబు అన్నీ అవాస్తవాలు రాశారు

* మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*

విశాఖపట్నంః రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాజధానికి సంబంధించిన బిల్లులను శాసనసభ, మండలిలో నిబంధనలకు అనుగుణంగానే ప్రవేశపెట్టామని, ఆ తర్వాత రాజ్యాంగబద్ధంగానే వాటిని గవర్నర్‌ ఆమోదం కోసం పంపామని ఆయన స్పష్టం చేశారు. ఆ బిల్లులు ఆమోదించవద్దని చంద్రబాబు కోరడం అసమంజసం అని బొత్స పేర్కొన్నారు. ఆ మేరకు చంద్రబాబు తన లేఖలో అన్నీ అవాస్తవాలు రాశారని ఆక్షేపించారు.

విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా పరిపాలన వికేంద్రీకరణే కోరిందని మంత్రి గుర్తు చేశారు. అయినా చంద్రబాబు అన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇచ్చిన ప్రతి మాట అమలు:
పరిపాలన వికేంద్రీకరణ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత అందుబాటులో పరిపాలన అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారని, ఆ మేరకు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు, తాను, తన అనుయాయులు అభివృద్ధి చెందాలని పరిపాలన కేంద్రం ఒకే దగ్గర ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా:
చంద్రబాబులా కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని మంత్రి చెప్పారు. లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ అమరావతిలో, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖలో, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారని గుర్తు చేశారు.
చంద్రబాబు.. కేవలం 8 కి.మీ పరిధిలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అంతా ఒకేచోట అభివృద్ధి చేయడం కంటే, పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ యథాతథంగా ఉంటుందని, నాడు పెద్ద మనుషుల ఒప్పందం నాటి నుంచి కర్నూలుకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి, అక్కడ జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు.
అయితే మండలిలో తమకు మెజారిటీ ఉందని చెప్పి, ఆ బిల్లులను అడ్డుకుని, విచక్షణ అధికారం పేరుతో టీడీపీ ఏకపక్షంగా, నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తామని చెప్పారని ఆక్షేపించారు.

కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని, ఆరోజు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలంతా బాధ పడ్డారని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తుందని ఎంతో ఆశ పడిన ఉత్తరాంధ్ర ప్రజలు కౌన్సిల్‌ ఛైర్మన్‌ నిర్ణయంతో నాడు బాధపడ్డారని తెలిపారు. అదే విధంగా శాసనసభ, మండలి ఇక్కడే ఉంటుందని విజయవాడ, గుంటూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని, మరోవైపు తమ ప్రాంతానికి హైకోర్టు వస్తుందని రాయలసీమ వాసులు ఆనందపడ్డారని వెల్లడించారు.

ఆ లేఖలో అన్నీ అవాస్తవాలే:
అయితే తన సామాజికవర్గంపై ఉన్న మక్కువతో చంద్రబాబు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఎస్సీలు, బీసీలు చాలా మంది భూములు లాక్కుని, దానికి లాండ్‌ పూలింగ్‌ అని పేరు పెట్టి, ఆ భూములు ఎవరెవరికో ఇచ్చారని మంత్రి చెప్పారు.
రాజధాని బిల్లులు ఆమోదించవద్దని చంద్రబాబు, గవర్నర్‌కు లేఖ రాశారని, అందులో అన్నీ అవాస్తవాలు ప్రస్తావించారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను కప్పి పుచ్చుకునేందుకే ఆ లేఖ రాశారని ఆరోపించారు.
‘రాజధాని ప్రాంతం గుర్తించడానికి నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామని ఆ లేఖలో రాశారు. ఇది పచ్చి అబద్ధం. అబద్ధాలు చెప్పడంలో ఆయనకు ఆయనే(చంద్రబాబు) దిట్ట. గ్లోబల్‌ ప్రచారం చేయడంలో ఆయనది అందె వేసిన చేయి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పింది?:
శివరామకృష్ణన్‌ కమిటీ కూడా రాజధాని వికేంద్రీకరణ జరగాలని సూచించిందని తెలిపారు. విజయవాడ, గుంటూరు మధ్యనే రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే, రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొనటమే కాకుండా, పైగా ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో రాజధాని ఏర్పాటు సరి కాదని ఆ కమిటీ పేర్కొందని గుర్తు చేసిన మంత్రి బొత్స.. మరి ఇది వాస్తవం కాదా? అబద్ధమా చెప్పండి? అని సూటిగా ప్రశ్నించారు.

ప్రజల మనోభావాలు బేఖాతరు:
ఆ తర్వాత చంద్రబాబు అప్పుడు పురపాలక శాఖ మంత్రి నారాయణతో కమిటీ వేశారని, ఆయన చంద్రబాబు చేత నియమించబడ్డారని.. ఎందుకంటే ఆ మంత్రి నారాయణ ఎమ్మెల్యేగా ప్రజల్లో గెలవలేదని ప్రస్తావించారు.
అప్పటి మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక కమిటీ వేసి, ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు పట్టించుకోకుండా రాజధాని గురించి నిర్ణయం ప్రకటింపచేశారని చెప్పారు. నిజానికి ఈ ప్రాంతంలో భవనాలు కట్టాలంటే పునాదుల 100 అడుగులకు పైగా తవ్వాల్సి వస్తుందని గుర్తు చేశారు.
ఇక్కడే రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు ఖర్చవుతాయని, అంత ఆర్థిక స్థితి రాష్ట్రానికి లేదని సీఎం గారు చెప్పారని, అందుకే వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టం కింద రూ.1500 కోట్లు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.

రాజధానికి రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశారన్నది అవాస్తవం..
వాస్తవంగా పనులపై చేసిన ఖర్చు రూ. 5674 కోట్లు మాత్రమే..
రాజధాని నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ అది వాస్తవం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
‘రాజధానిలో నిర్మాణాల కోసం నాడు వాస్తవంగా రూ.7635 కోట్లు మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అందులో హంగులు, ఆర్భాటాలకు పోనూ నిజంగా పనుల మీద చేసిన ఖర్చు రూ.5674 కోట్లు మాత్రమే. అది కూడా హడ్కో రుణం, బాండ్ల రూపంలో సేకరించారు. వాటికి వడ్డీల కింద, ఈఎంఐల కింద రూ.329 కోట్లు చెల్లించారు. ఇక వాటికి ప్లాన్లు వేసిన వారికి (ఆర్కిటెక్ట్‌లకు) అడ్వాన్స్‌ల కిందనే రూ.321 ఇచ్చారు. లాండ్‌ పూలింగ్‌ ఖర్చుల కింద రూ.1300 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ కలిపి రాజధాని కోసం మొత్తం రూ.7635 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఆ మొత్తంలో నిజంగా పనులపై చేసిన వ్యయం కేవలం రూ.5674 కోట్లు మాత్రమే’ అని మంత్రి బొత్స వివరించారు.
రాజధాని నిర్మాణం కోసం చేసిన వ్యయంలో రూ.5674 కోట్లలో, రూ.4941 కోట్లు రుణాల రూపంలో వివిధ బ్యాంకులు, హడ్కో నుంచి సేకరించారని బొత్సా చెప్పారు.

తగుదునమ్మా అంటూ!:
‘వేల కోట్ల అప్పులు చేసి, అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు.. చదరపు అడుగుకు రూ.10 వేల చొప్పున కాంట్రాక్ట్‌ ఇచ్చి, ఇవాళ తగుదునమ్మా అని చెప్పి, రాజధాని బిల్లులు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాశారు. సిగ్గుందా మీకు?’ అని గట్టిగా నిలదీశారు.
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీ రద్దు.. రెండు బిల్లులను సభలో రెండుసార్లు ఆమోదించినా, మండలిలో అడ్డుకున్నారని ప్రస్తావించారు. తాము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేశారు.

విచక్షణాధికారాన్ని ప్రజా ప్రయోజనం కోసం కాకుండా.. బాబు ప్రయోజనాల కోసం..
ఆరోజు మండలిలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా చూశారని, నాడు ఛైర్మన్‌ స్వయంగా చెప్పారని, అంత ఉన్నతస్థాయిలో కూర్చున్న వ్యక్తి, తన పార్టీ అధినేత స్వయంగా తన కళ్ళ ముందే కూర్చొనడంతో, తనకున్న విచక్షణాధికారంతో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించినట్లు చెప్పారని, ఆ సందర్భంగా ఆయన మూడుసార్లు.. ‘అయినప్పటికీ’ అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఛైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయన్న విషయం తమకూ తెలుసని, అయితే వాటిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాకాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం వినియోగించకూడదని చెప్పారు.
తొలుత నెలలు గడిచినా బిల్లులపై ఏ నిర్ణయం తీసుకోలేదని, దీంతో మళ్లీ శాసనసభలో ఆమోదించి, మండలిలో ఆమోదం కోసం పంపించామని, అయినా రెండోసారి కూడా మండలిలో అడ్డుకున్నారని మంత్రి గుర్తు చేశారు.

అనైతికంగా వ్యవహరించారు:
‘మండలిలో ఛైర్మన్‌ ఆమోదం లేకుండానే ఏ పేపర్‌ను కూడా ప్రవేశపెట్టరు కదా? మరి అలా పెట్టిన తర్వాత చర్చ కోరాము. కానీ అందుకు ఒప్పుకోలేదు. ఆరోజు మండలిలో టీడీపీ తప్ప, అందరూ ఆ బిల్లులపై ఓటింగ్‌ జరగాలని కోరారు. మండలిలో బిల్లలపై చర్చ జరగాలని మేం కోరాం. కానీ సంఖ్యా బలం ఉందని చెప్పి, వీధి రౌడీల మాదిరిగా టీడీపీ సభ్యులు వ్యవహరించారు. దుర్భాషలాడారు. నిబంధనలకు విరుద్ధంగా లోకేష్, వీడియోలు తీశారు. దాన్ని మండలి డిప్యూటీ ఛైర్మన్‌ కూడా వద్దన్నారు. ఆ తర్వాత బిల్లులపై ఏ చర్చా లేకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించే సంస్కృతి తెలుగుదేశంకు లేదని, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలో అన్నీ వివరంగా ఉన్నాయని, కానీ వాటిని గౌరవించే సంప్రదాయం టీడీపీకి లేదని ఆక్షేపించారు.

నిబంధనలకు అనుగుణంగానే గవర్నర్ ఆమోదానికి బిల్లులు..
మండలిలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 30 రోజుల్లోగా ఏ నిర్ణయం తీసుకోకపోతే, దాన్ని ఆమోదించినట్లుగా పరిగణించాలని, ఈ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. ఆ మేరకు అన్ని నిబంధనలకు అనుగుణంగానే రాజధాని బిల్లులను గవర్నర్‌ ఆమోదం కోసం పంపామని వెల్లడించారు. అయినా వాటిని ఆమోదించవద్దంటూ చంద్రబాబు లేఖ రాశారని ఆక్షేపించారు.

‘ఐ ఆన్‌ క్యాపిటల్‌.. లాస్‌ ఇన్ విజన్‌’ బాబుకు మరోలా అర్థమైందేమో..
గవర్నర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు అన్నీ అవాస్తవాలు రాశారని మరోసారి స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, అమరావతిలో రాజధానికి సంబంధించి వాస్తవంగా నాడు శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదికలో ప్రస్తావించిన ఒక అంశాన్ని గుర్తు చేశారు.
‘ఐ ఆన్‌ క్యాపిటల్‌. లాస్‌ ఇన్ విజన్‌’ అని శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదికలోని 12, 13 పేజీలలో రాసిందంటూ దాని అర్థాన్ని బొత్స వివరించారు.
అయితే, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను సైతం వక్రీకరిస్తూ.. ‘నా దృష్టి, నా ఆలోచన అంతా క్యాపిటల్‌ మీదే ఉంది కాబట్టి, మిగతావన్నీ కనిపించడం లేదు అన్నట్లుగా చంద్రబాబు వైఖరి, దృష్టి ఉంది. ఆయన (చంద్రబాబు)కు దూరదృష్టి లోపించింది’ అని దానర్ధం అని వివరించారు.
వాస్తవం అలా ఉంటే చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని, అమరావతిలోనే రాజధాని ఉండాలని కమిటీ చెప్పిందని అంటున్నారని చెప్పారు.

ఎందుకంత కోపం:
అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం పరిపాలన వికేంద్రీకరణపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్న మంత్రి బొత్స.. వాటిపై అభ్యంతరం చెబుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.
‘నీవు పుట్టిన రాయలసీమ మీద ఎందుకింత కోపం? ఉత్తరాంధ్ర మీద ఎందుకంత కక్ష?. ఎక్కడో రాయలసీమలో పుట్టిన జగన్‌ గారు, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని నిర్ణయం తీసుకుంటే, నీకు ఎందుకింత కోపం?. దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖ ఒకటి. అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలంటే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అమరావతిలో చేసే వ్యయంలో కనీసం 10 శాతం ఖర్చు చేస్తే చాలు’ అని మంత్రి బొత్స తేల్చి చెప్పారు.
అమరావతిలో నాడు చంద్రబాబు రూ.5674 కోట్లు ఖర్చు చేసి, దానిపై రూ.320 కోట్లకు పైగా వడ్డీలు కట్టి, కన్సల్టెన్సీలకు మరో రూ.321 కోట్లు ఇచ్చి, రాజధాని నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని ఆక్షేపించారు.

ఆ లక్ష్యంతోనే ముందుకు:
‘రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. శాసనసభలో రెండుసార్లు బిల్లులను ఆమోదించిన తర్వాతే, వాటిని గవర్నర్‌ గారి ఆమోదం కోసం పంపాం. రాజ్యాంగబద్ధంగానే ఆ పని చేశాం.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని, అందరూ బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈ నిర్ణయం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

గవర్నర్ కు చంద్రబాబు లేఖ రాయడం సిగ్గుచేటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *