‘కాపాడుదామనుకున్నా.. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తపడాలి’: రంగం భవిష్యవాణి 2020

సికింద్రాబాద్: ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా.. రంగం కార్యక్రమంలో స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ‘‘ఎవరు చేసిన పాపాలను వాళ్లు అనుభవించక తప్పదు.. మీరు చేసుకున్నదే కదా.. కట్టడి చేద్దామని అనుకున్నా కానీ మీ చేతులారా చేసుకుంటున్నార’’ని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాకు సంతోషం లేదు రా బాలక.. నా ప్రజలు చేసినందుకు ఎంతో దుఃఖిస్తున్నాను. నా ప్రజలందర్నీ నేను తప్పనిసరిగా కాపాడతాను. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముందుగానే హెచ్చరిస్తున్నానన్నారు.