మొక్కలు నాటండీ..ఉష్ణ తాపాన్ని తగ్గించండి!!! మంత్రి అవంతి శ్రీనివాసరావు పిలుపు

విశాఖ పట్నం
భూ ఉపరితలంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి అధిక సంఖ్యలో మొక్కలను నాటాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం గాజువాక నియోజకవర్గం 86 వార్డులో జీవీఎంసీ ఆధ్వర్యంలో మియావాకే ఫారెస్ట్ సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటాలని , వాటిని భాద్యతగా సంరక్షించాలనియన్నారు.రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖలో గతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేవని ,ప్రస్తుతం ఉష్ణోగ్రత పెరిగిందని దీనిని తగ్గించడానికి మొక్కలను అధిక సంఖ్యలో నాటి గ్లోబల్ వార్మింగ్ ను తట్టుకొనే విధంగా పర్యావరణ సమతుల్యత తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, జీ వీ ఎం సీ కమిషనర్ శ్రీమతి జి సృజన తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *