ఫార్మాలో ప్రమాదానికి అదే కారణమా?? ఎంత దారుణమో చూడండీ నివేదిక

పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌ వినయ్ చంద్ నియమించిన విచారణ కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసింది.
ఐదుగురు సభ్యులతో కూడా కూడిన ఈ కమిటీ.. ప్రమాదంపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించింది.
ప్రమాదం జరిగిన తీరు ఆ తర్వాత నెలకొన్న పరిణామాలపై రెండు పేజీల నివేదికను కలెక్టర్‌కు అందజేసింది.
సాల్వెంట్‌ రికవరీ రియాక్టర్‌ వద్ద డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్దిచేసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా కమిటీ నివేదికలో పేర్కొంది.
సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో విఫలం కావడంతోనే ఈ ప్రమాదం
కేవలం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభందించిదని కమిటీ సభ్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.
రాత్రి 9 గంటలకు షిఫ్ట్ మారే సమయంలో డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్ధి కోసం వేర్వేరు రసాయనాలు పంపించే క్రమంలో కొంత అధికపీడనం నెలకొన్నది.
అదుపుచేయడానికి కెమిస్ట్ మల్లేష్ ముందుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
అదే సమయంలో కింది అంతస్తులో వచ్చిన స్పార్క్ తో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందారు’
ప్రమాదానికి గల కారణాలను కమిటీ తన నివేదికలో పేర్కొంది.
9గంటల సమయంలో ఈ ప్రమాదాన్ని గుర్తించిన కార్మికుడు ముందుగా హెచ్చరించినా ఫలితం లేకపోయింది
మరోవైపు సాల్వెంట్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంపై పరవాడ పోలీస్‌ స్టేషన్‌లో 304/ఏ, 328 సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *