పద్మనాభస్వామి ఆలయ వివాదం.. రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్కోర్ రాజ వంశానికి కట్టబెట్టింది. త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలోనూ కమిటీని కూడా నియమిస్తున్నట్టు తెలిపింది. ఇది, ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్యే మార్గంగా ఉంటుందని స్పష్టం చేసింది.