అక్కయ్యపాలెం లో దారుణ హత్యకు తెగబడిన కుటుంబసభ్యులు

విశాఖ నగరంలో ఉన్న అక్కయ్యపాలెం లోని
80ఫిట్ రోడ్డు లో దరి రామచంద్ర నగర్ లో ఈరోజు (శనివారం ) రాత్రి 10 నుండి 10.30 గం. ల. మధ్య ప్రాంతంలో హత్య జరిగినట్లుగా తెలుస్తోంది.
కస్తూరి అశోక్ వర్మ, s/o. సీతారామరాజు, (వయసు 29 సం,,లు) అనే వ్యక్తిను అతని తల్లీ కస్తూరి వరలక్ష్మి , అక్క శ్రీదేవి , మరియు బావ వెంకటేశ్వర రాజు, ముగ్గురు కలిసి హత్య చేసి నాలగవ పట్టణ పోలీసులుకు ఫిర్యాదు అందించారు. ఈ సమాచారాన్ని అందుకున్న నాల్గవ పట్టణ పోలీసులు… సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు, ఇంటిలో ఉన్నవారిని విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. విచారణ తదుపరి వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *