అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేత.. లైంగిక ఆరోపణలతో ఆత్మహత్య

దక్షిణ కొరియా నేత, సియోల్ మేయర్ పార్క్ వోన్-సూన్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మర్నాడే బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుల్లో పార్క్-వోన్ సూన్ ఒకరు కావడం విశేషం. ఆయన మృతదేహాన్ని సియోల్‌లోని ఓ పర్వతం వద్ద గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న అత్యంత ఉన్నతస్థాయి రాజకీయ నేత కాగా.. మీటూ ఉద్యమం వివిధ రంగాలలోని ప్రముఖుల పతనానికి దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *