పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్‌పై ఉగ్రదాడి.. ఐదుగురు మృతి

పాకిస్థాన్‌లో స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ భవనం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. ఈ భవనం నలుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రదాడితో అప్రమత్తమమైన భద్రతా బలగాలు ప్రతిదాడిచేసి ముగ్గుర్ని హతమార్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలోని సిబ్బందిని అధికారులు ఖాళీచేయించారు. దాడిలో పలువురికి గాయాలైనట్టు పాక్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులేనని పేర్కొంది.

స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి ప్రవేశించిన ముష్కరులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు, పాక్ సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించి ముష్కరులను కాల్చి చంపింది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకున్న సైన్యం… మరో ఉగ్రవాది దాక్కుని ఉంటాడని అనుమానిస్తోంది. ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు.. ఉగ్రవాదులు మెయిన్ గేట్ నుంచి భవనంలోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *