RRR: ఎట్టకేలకు షూటింగ్ రీ-స్టార్ట్.. కరోనా పట్ల జాగ్రత్త తీసుకుంటూ రాజమౌళి పక్కా ప్లాన్

షూటింగ్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు రావడంతో రాజమౌళి.. తన RRR మూవీని తిరిగి సెట్స్ మీదకు తీసుకొచ్చారు. కరోనా పట్ల జాగ్రత్త తీసుకుంటూ మిగిలిన కరోనా కారణంగా వాయిదాపడ్డ షూటింగ్స్ దాదాపు 80 రోజుల తర్వాత తిరిగి రీ ఓపెన్ అయ్యాయి. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రముఖుల కోరిక మేరకు పలు నిబంధనలు పెట్టి షూటింగ్స్ రీ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఒక్కొక్కరుగా అంతా సెట్స్ మీదకు వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి.. నేడు (జూన్ 15) తన RRR మూవీ కెమెరా ఆన్ చేశారని తెలిసింది.