బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. సుశాంత్ మరణంతో బాలీవుడ్‌లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్.. ‘ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని ఆయన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. డిప్రెషన్‌తో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టు పోలీసులు, ఆయన స్నేహితులు చెబుతున్నారు. సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *