సీఎంతో భేటీకి సన్నద్ధమవుతున్న వేళ.. బీజేేపీ నేతల హౌస్ అరెస్ట్

సీఎంను కలవడానికి ప్రగతి భవన్ వెళ్లేందుకు సమాయత్తమైన బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలని… కోవిడ్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, బాధితులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని బీజేపీ నేతలు భావించారు. ‘సేవ్ హైదరాబాద్’ పేరిట కేసీఆర్‌ను కలవడం కోసం గత రెండు రోజులుగా కమలనాథులు ప్రయత్నాలు చేశారు. కానీ సీఎంవో నుంచి సమాధానం రాలేదదు.