మా బాలకృష్ణ అంటూ.. చిరంజీవి ఆసక్తికర ట్వీట్

ఇవాళ బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది బాలయ్యకు 60వ పుట్టినరోజు. దీంతో నందమూరి కుటుంబం షష్టిపూర్తి సంబరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తును శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే సోషల్ మీడియాలోకి వచ్చిన మెగస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. మా బాలయ్య అంటూ చిరు అప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday’ అంటూ చిరు ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *