విజయవాడ వెళ్లిన సినీ ప్రముఖలకు అమరావతి రైతుల నిరసన సెగ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులకు అమరావతి రైతులు షాకిచ్చారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కరకట్టపై ఉన్న గోకరోజు గంగరాజు గెస్ట్‌హౌస్‌కువ వెళ్లారు. ఆ సమాచారం అందుకున్న రైతులు అక్కడికి వెళ్లారు.. ప్లకార్డులతో అక్కడ మానవహరంగా నిలబడ్డారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. 175 రోజులుగా నిరసనలు చేపట్టినా ఎవరూ పట్టించుకోలేదని.. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమకు ఇచ్చే శిక్ష అంటూ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై సినిమాలు చాలా తీశారని.. అలాంటి సెలబ్రిటీలు తమ సమస్యలు పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును వాళ్లకు చెప్పుకోవడానికి వచ్చామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *