పోలీసులపై దాడి, ఏఎస్‌ఐ చేయి నరికివేత.. లాక్‌డౌన్ విధుల్లో దారుణం

లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంత మంది దాష్టీకానికి తెగబడ్డారు. ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఓ పోలీసు అధికారి చేయి నరికేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంజాబ్‌లోని పాటియాల జిల్లాలో ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్లో ప్రజలను నియంత్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన పోలీసు అధికారికి చంఢీగర్ ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *