కొండవాలు ప్రాంతాల్లో శ్రీ. కె కె రాజు గారు పర్యటన

విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గల 49, 50, 51 వార్డు కొండవాలు ప్రాంతాల్లో జీవీఎంసీ అధికారులతో కలిసి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ. కె కె రాజు గారు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ. కె.కె. రాజు గారు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నప్పుడు కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం , డ్రైనేజిలు పొంగిపొర్లుతున్నాయని. దీనోతో స్థానికులకు తీవ్ర నష్టం వాటిల్లితుందని అన్నారు. కాబట్టి ఈ సమస్యలు ముందుగా గుర్తించి రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం, అలాగే డ్రైనేజి లు పూడిక తీత పనులు చేపట్టాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో.వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, జీవీఎంసీ అధికారులు.కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.