రైతన్నలకు రూ. 10 వేల కోట్లిచ్చాం, ఈ 3 అంశాలే ప్రధానం.. సీఎం జగన్ వెల్లడి

వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతులు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మన లక్ష్యమని పేర్కొన్నారు. 3,648 కిలో మీటర్ల తన పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని గుర్తు చేసుకున్నారు. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు వెల్లడించారు.