అమెరికాలో చిక్కుకున్న హాకీ ఒలింపియ‌న్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా అంత‌ర్జాతీయంగా స‌రిహ‌ద్దులు మూసివేసిన సంగ‌తి తెలిసిందే. చాలామంది భార‌తీయులు వివిధ దేశాల్లో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి, అక్క‌డే చిక్కుకున్నారు. తాజాగా వీరి జాబితాలో 1975 హాకీ ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించిన భార‌త జ‌ట్టు స‌భ్యుడు, 1976 ఒలింపియ‌న్ అశోక్ దివాన్ చేరారు. త‌ను అమెరికాలో చిక్కుకున్న‌ట్లు తాజాగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు లేఖ రాశాడు. గ‌త డిసెంబ‌ర్‌లో అక్క‌డికి వెళ్లిన దివాన్‌.. ఈనెల 20న స్వ‌దేశానికి రావాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *