AP లో ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం.కొత్త దరఖాస్తులు తీసుకోవాలని సీఎం ఆదేశాలు

AP లో ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం.కొత్త దరఖాస్తులు తీసుకోవాలని సీఎం ఆదేశాలు
కొత్తగా దరఖాస్తులు తీసుకోండి
వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం జగన్ ఆదేశం
అమరావతి : ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని సిఎం సూచించారు. మరో 15 రోజులు సమయమిచ్చి దరఖాస్తులు తీసుకోవాలని, పరిశీలన అనంతరం గామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఆదేశించారు. హౌసింగ్, పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు, నాడు-నేడు కింద కార్యక్రమాలు, ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం, తాగునీరు, ఉపాధి హామీ, కరోనా నివారణా చర్యలు తదితర అంశాలపై ఈ వీడియో కాన్ఫరెన్స్లో సిఎం సమీక్షించారు.
జులై 8న 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. మే 6 నుంచి 21 వరకూ జాబితాల ప్రదర్శించాలని, ఆ తర్వాత మరో 15 రోజుల పాటు పరిశీలించి జూన్ ఏడులోగా తుదిజాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు.