విజ్డెన్ లిస్ట్‌లో రోహిత్ శర్మ లేకపోవడమేంటి..?

Rohit Sharma of India raises his bat after scoring a hundred during the 2nd ODI between India and the West Indies held at the ACA-VDCA Stadium, Visakhapatnam on the 18th December 2019. Photo by Vipin Pawar / Sportzpics for BCCI

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా విజ్డెన్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. కానీ.. 2019లో అతను పేలవ ప్రదర్శన కనబర్చినా.. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ జోరు కొనసాగించాడు. దీంతో.. విజ్డెన్ రేసులో రోహిత్ ఉంటాడని అంతా ఆశించారు. కానీ..?

ప్రతిష్ఠాత్మక విజ్డెన్ క్రికెటర్ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పేరు లేకపోవడం తనని ఆశ్చర్యపరిచిందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. 2019లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌.. ఆ జట్టు ప్రపంచకప్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా.. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అసాధారణ పోరాట పటిమని కనబర్చిన బెన్‌స్టోక్స్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ అదేజోరుని కొనసాగించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *