అసలు సమస్య ఏంటి అంటే అంత పెద్ద డబ్బు ప్రభుత్వం ఎలా సమకూర్చుతుంది.

కొత్తగా ముద్రిస్తుందా !! అలాంటి అవకాశమే లేదు.
(ప్రభుత్వం కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే ముద్రించే అవకాశం ఉంది.)

RBI ప్రధాన మరియూ ద్వితీయ మార్కెట్లలో నుండి G-secs కొనుగోలు చేయనుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి, ఇదే నిజమైతే ప్రజలు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది, ఇది మొత్తం దేశం మునిగిపోయేలా చేస్తుంది.

ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం చూస్తుంది అని నేను అనుకుంటున్నాను

నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఇది అందినప్పుడే ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజీ విజయం సాధించినట్టు.

ఈ నగదు పంపిణీ కూడా ప్రభుత్వ బ్యాంకుల మీద పెడితే, నోట్ల కొరతలో దేశం ఇబ్బందుల పాలవుతుంది. ఈ సొమ్మును మళ్ళీ బడా బడా కంపెనీలకు అప్పులు ఇస్తే మళ్లీ అవి NPAలు ( non-performing- asserts ) గా మారే ప్రమాదం లేకపోలేదు, ఇది కూడా ప్రజల మీద భారంగా మారుతుంది.

చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు ఈ ప్యాకేజి అందేలా ప్రభుత్వం చూడాలి, అప్పుడే ఈ ఆర్ధిక సమస్య నుండి బయట పడే అవకాశం ఉంటుంది.

covid వల్ల నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వం సిద్దం చెయ్యాలి.

ఈ పని కూడా బ్యాంకుల మీద వదిలేస్తే వాళ్ళు మళ్ళీ అదే పెద్ద పెద్ద కార్పరేట్ లకు లాభం చేసేలా పనిచేస్తాయి.

ఇలాంటి ప్రభుత్వ ప్యాకేజిలు కాగితాల మీద ఎంత బాగున్నా, అవి పేద వాడికి చేరడంలో మాత్రం ఎప్పడు విజయం సాదించలేదు. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో .

మన దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ఇంత డబ్బు ఒకేసారి చలామణీలోకి వస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చూడాలి.

ఇది ఈ దేశం పౌరులకి ఒక జీవితకాల అనుభవంగా మిగిలిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *