తాజ్ హోటల్ ఉద్యోగుల్లో ఆరుగురికి కరోనా.. క్వారంటైన్లోకి 500 మంది!

ముంబయిలోని ప్రముఖ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్స్‌లోని ఆరుగురు సిబ్బందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో కలకలం రేగుతోంది. తమ హోటల్లో పనిచేసే సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చిందని ప్రకటించిన తాజ్ యాజమాన్యం.. ఎందరు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కరోనా బాధితులకు చికిత్స అందజేసే వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, అత్యవసర విభాగాలకు చెందిన సిబ్బందికి ముంబయిలో తమ హోటల్స్‌లో తాజ్ యాజమాన్యం ఆశ్రయం కల్పిస్తోంది. కొలబాలోని తాజ్ ప్యాలెస్, బంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్, కుఫ్ పరేడ్‌లోని వివాంత ప్రెసిడెంట్, తాజ్ శాంతాక్రూజ్‌లో ప్రస్తుతం వైద్య సిబ్బందికి కేటాయించారు.