న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలు షేర్ చేశారో.

న్యూఢిల్లీ: నెటిజన్లకు ఇది హెచ్చరికే. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఇకపై న్యూస్‌పేపర్ల పీడీఎఫ్ కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేరం. ఈ మేరకు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) హెచ్చరించింది. ఈ-పేపర్లను పీడీఎఫ్‌గా మార్చి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం నేరమని పేర్కొన్న ఐఎన్ఎస్.. అలా షేర్ చేసే అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించాలని దినపత్రికల యాజమాన్యాలను కోరింది.న్యూస్ పేపర్ యాజమాన్యాలు ఇప్పటికే పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయని, అలాగే, ప్రింట్ అయిన కాపీలను పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఐఎన్ఎస్ పేర్కొంది. ఇలాంటి సమయంలో డిజిటల్ ఫార్మాట్‌లో పైరసీ, చోరీ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చాలామంది న్యూస్ పేపర్లను కాపీ చేసి దానిని పీడీఎఫ్‌గా మార్చి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారని వివరించింది. దీనివల్ల సబ్‌స్క్రిప్షన్ రెవెన్యూతోపాటు ఈ-పేపర్లు డిజిటల్‌గానూ నష్టపోతున్నాయని పేర్కొంది.
కాబ్టటి ఈ విషయాన్ని ఆయా దినపత్రికలన్నీ తమ యాప్‌లు వెబ్‌సైట్లలో హెచ్చరికలు జారీ చేయాలని సూచించింది. న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలను సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరికలు చేయాలని ఐఎన్ఎస్ సూచించింది. అలాగే, పీడీఎఫ్‌లు, ఇమేజ్‌ల డౌన్‌లోడ్లను నియంత్రించేందుకు కనిపించని కోడ్‌ను వాటిల్లో ఇమడ్చాలని కోరింది. ఫలితంగా షేర్ చేసే వారిని సులభంగా గుర్తించవచ్చని ఐఎన్ఎస్ వివరించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *